లూనార్ క్రాష్‌పై తొలిసారి స్పందించిన రష్యా అంతరిక్ష సంస్థ చీఫ్

చంద్రుడిపై లూనార్-25 కుప్పకూలడంపై రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌కాస్మాస్ చీఫ్ యూరీ బొరిసోవ్ తొలిసారి స్పందించారు. ఇంజిన్లు సమయానికి మూసుకోకపోవడం వల్లే అది క్రాష్ అయినట్లు తెలిపారు. అంతేకాదు చంద్రుడిపై పరిశోధనల కోసం దశాబ్దాల తర్వాత ప్రయోగం చేపట్టడం మరో కారణమని చెప్పారు. జాబిల్లిపై సహజ వనరుల కోసం పోటీ మొదలైందన్న ఆయన అంతరిక్ష అన్వేషణకు చంద్రుడు సరైన వేదిక కానుందని తెలిపారు.

04:17 PM, 22nd Aug 2023