‘గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించే ఆలోచన లేదు’
గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించే ఆలోచన లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. లోక్‌సభలో బీజేపీ ఎంపీ భగీరథ్ చౌదరి అడిగిన ప్రశ్నకు కిషన్ రెడ్డి సమాధానమిచ్చారు. మరోవైపు భారత్‌లో 2006లో 1,411గా ఉన్న పులుల సంఖ్య.. 2022లో 3,682కి పెరిగినట్లు తెలిపారు. పులుల సంఖ్యను రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని చేరుకున్నట్లు మంత్రి వెల్లడించారు.
06:24 PM, 7th Aug 2023